Wednesday, 13 April 2016

CCE GRADING

పదిలో ‘వెయిటేజీ’ సంస్కరణలు480 మార్కులకు పబ్లిక్‌ పరీక్షలు120 మార్కులు అంతర్గత మూల్యాంకనం2017-18 నుంచి అమలుపాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు

హైదరాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): పరీక్షల మూల్యాంకన విధానంలో సంస్కరణలకు పాఠశాల విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. 6 నుంచి 10వ తరగతి వరకూ కామన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. అంతర్గత మూల్యాంకన మార్కులకు వెయిటేజీ ఇస్తూ పరీక్షల్లో సంస్కరణలు తీసుకువస్తున్నారు. ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల్లో అంతర్గత మూల్యాంకన మార్కులకు మొత్తం 20 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. 8వ తరగతి అంతర్గత మూల్యాంకన పరీక్షల్లో సాధించిన మార్కులకు 5 శాతం, 9వ తరగతి అంతర్గత మూల్యాంకన పరీక్షల్లో పొందిన మార్కులకు 5 శాతం, 10వ తరగతి అంతర్గత మూల్యాంకన పరీక్షల్లో సాధించిన మార్కులకు 10 శాతం వెయిటేజీ ఇస్తారు. 2017-18 విద్యా సంవత్సరం నుంచి ఈ సంస్కరణలు అమల్లోకి రానున్నాయి. అంటే ఆ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు వీటిని వర్తింపజేస్తారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ యాజమాన్యాలలోని పాఠశాలలన్నింటిలో సంస్కరణలు వర్తింపజేస్తున్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులకు కలిపి 11 పేపర్లు ఉంటాయి. సెకండ్‌ లాంగ్వేజ్‌ (తెలుగు/హిందీ) సబ్జెక్టులో ఒకే పేపర్‌ 100 మార్కులకు, ఫస్ట్‌ లాంగ్వేజ్‌, థర్డ్‌ లాంగ్వేజ్‌, మాథ్స్‌, సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌ సబెక్టుల్లో రెండు పేపర్లుగా 50 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు.

 

ప్రతి పేపర్‌లోనూ 80శాతం మార్కులకు పబ్లిక్‌ పరీక్ష, 20 శాతం మార్కులకు ఇంటర్నల్‌ అసె్‌సమెంట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. అంటే మొత్తం మీద పబ్లిక్‌ పరీక్షలను 480 మార్కులకు నిర్వహించి , 120 మార్కులను అంతర్గత మూల్యాంకనానికి కేటాయించారు. దీంతో ఇకపై పరీక్షల నిర్వహణలో ఫార్మేటివ్‌, సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. పరీక్షల విధానంలో సంస్కరణలపై ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఈ వ్యవహారంపై నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ సూచనల మేరకు ఈ సంవత్సరం నుంచి మూల్యాంకన విధానంలో సంస్కరణలు తీసుకువస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
********************************************

📕పరీక్షా విధానంలో సంస్కరణలు:🖍🖌🖋🖊

📚GO.82 లోని ముఖ్యాంశాలు:📚

1) 2015-16 విద్యా సంవత్సరం నుండి 6,7,8,9 తరగతుల వరకు CCE అంతర్గత మరియు బహిర్గత రూపాలలో అమలు చేయబడుతుంది.

2) 2016-17 సంవత్సరం నుండి 10వ తరగతిలో CCE అమలు చేయబడుతుంది.

3) 2015 మార్చి లో జరిగిన మాదిరిగానే 2016 మార్చిలో SSC పరీక్షలు జరుగుతాయి. అనగా ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా విధానంలో మార్పులేదు.

👏🏾6,7,8 తరగతులకు ఇప్పుడున్నట్లుగానే పరీక్ష పేపర్లు ఉంటాయి. కానీ 80 మార్కులకే ఉంటాయి.

👏🏾9,10 తరగతులకు మొత్తం 11 పేపర్లు ఉంటాయి.

👏🏾హిందీ తప్ప మిగిలిన అన్ని సబ్జెక్టులకు రెండేసి పేపర్లు, ఒక్కో పేపరుకు 40 మార్కులకు ఉంటుంది.

👏🏾హిందీ 80 మార్కులకు ఉంటుంది.

👏🏾మిగిలిన 20 మార్కులు అంతర్గత మూల్యాంకనం అనగా 4 FA లు మరియు 2 SA లలో వచ్చిన మార్కులకు లెక్కించబడుతుంది.

👏🏾కేవలం విద్యార్ధి చివరి పరీక్షలలో చూపే ప్రతిభ కాకుండా పాఠశాలలో మొదటి నుండి వివిధ అంశాలలో చూపే ప్రతిభ ఆధారంగా 20% మార్కులు పొందును.

👏🏾అన్ని పేపర్లకు పరీక్షా సమయం 2.30 గంటలు మరియు ప్రశ్నాపత్రం చదువుటకు 15 నిమిషాలు మొత్తంగా 2.45 గంటలు ఇవ్వబడుతుంది.

👏🏾9వ తరగతి లో ఈ సంవత్సరము నుండే ఈ మార్పులు అమలు అవుతాయి. SA లలో 11 పేపర్ల విధానం అమలు అవుతుంద

📚పాఠ్యాంశాల-మూల్యాంకనం (GO.82 ప్రకారం ) 📚
👉🏾1) నిర్మాణాత్మక మూల్యాంకనం (Formative Assessment):

👏🏾ఈ మూల్యాంకనం ఇప్పటికే అమలు చేస్తున్న మాదిరిగా 6,8 తరగతులలో సంవత్సరంలో 4 సార్లు చేయాలి.

👏🏾FA లలో 50 మార్కులకు గాను 18 మార్కులు పాస్ మార్క్ గా పరిగణించబడుతుంది.

👏🏾ప్తస్తుతం ఉన్న గ్రేడింగ్ కూడా మారుతుంది.

👏🏾భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం లలో విడివిడిగా FA నిర్వహించినా రెండింటినీ కలిపి 50 మార్కులకు తగ్గించి సైన్స్ సబ్జెక్ట్ కింద నమోదు చేయాలి.

👏🏾2) సంగ్రహణాత్మక మూల్యాంకనం(Summative Assessment):

👏🏾6 నుండి 10 తరగతులకు 3 SA లు నిర్వహించబడతాయి.

👏🏾10 వ తరగతికి 3వ SA కు బదులుగా పబ్లిక్ పరీక్ష నిర్వహించబడుతుంది.

👏🏾SA-1 మరియు SA-2 ప్రశ్నా పత్రాలను DCEB తయారు చేయించాలి.

👏🏾6,7,8 తరగతులకు SA 80 మార్కులకు మరియు 9,10 తరగతులకు ఒక్కొక్క పేపరు 40 మార్కులకు, హిందీ మాత్రం 80 మార్కులకు ఇవ్వబడుతుంది.

👏🏾SA-3 ప్రశ్నా పత్రాలను (6 నుండి 9 తరగతులకు) SCERT రూపకల్పన చేసి DEO లకు మెయిల్ చేస్తుంది.

👏🏾SA-3 లో 20 మార్కులను 4 FA లు, 2 SA లలో వచ్చిన మార్కులనుండి తీసుకోవాలి.

👏🏾అనగా 4 FA ల మొత్తం = 200
2 SA ల మొత్తం(80+80) = 160
(4FA+2SA) = 360.

👉🏾👉🏾👉🏾👉🏾పాస్:
🖊🖊🖊ప్రతీ సబ్జెక్ట్ నందు 35% రావాలి(హిందీ కూడా).

🖍అనగా 80 మార్కులకు గాను 28(GOలో 27 అని ఇచ్చారు) SA-3 లో తప్పకుండా రావాలి.

🖍మిగిలిన 7 మార్కులు(GOలో 8 అని ఇచ్చారు) అంతర్గత మూల్యాంకనం నుండి రావాలి.

🖍అంతర్గత మూల్యాంకనం నందు పాస్ మార్క్ లేదు.

🖍కానీ SA-3 మరియు అంతర్గత మార్కులు కలిపితే 35 మార్కులు తప్పకుండా రావాలి.
*******************************************
#Calculation of Internal Assessment 20 marks . #
**********************
✍🏻360 మార్కులను 20 మార్కులకు  రెడ్యూస్  చేయుట ✍🏻
**********************

🍁F1+F2+F3+F4=200

🌹SA1×1.6+SA2×1.6=160

200+160
-----------------= 20 మార్కులు.
    18

***********************
🍁Example🍁

FA::37+44+44+43=168

SA::43×1.6+46×1.6=142

🍀20 మార్కులకు  రెడ్యూస్  చేయుట

168+142
----------------
      18.       

    310
   ---------=17.
     18

                  (Or)
310  
------    ×20= 17
360

యిప్పుడు  ఆ విద్యార్ధి కి 20 మార్కులకు గాను  17 మార్కులు.అని చెప్పవచ్చు.

🍀✍🏻🍀✍🏻🍀✍🏻🍀

♦♦♦♦♦

20% of 360.
♦♦♦♦

FA=50M
4FAs=4x50=200M
SA1=80M
SA2=80M
4FAs+SA1+SA2
=200M+80M+80M
=360M

MARKS--20%

*351-360--20
*333-350--19
*315-332--18
*297-314--17
*279-296--16
*261-278--15
*243-260--14
*225-242--13
*207-224--12
*189-206--11
*171-188--10
*153-170--9
*135-152--8
*117-134--7
*99-116----6
*81-98------5
*63-80------4
*45-62------3
*27-44------2
*9-26--------1
*0-8----------0

SA3=80M
FINAL MARKS
=20M+S3(80)=100M.♦

No comments:

Post a Comment